Search
Close this search box.

తపాలా శాఖలో 44,228 కొలువులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి పరీక్షలు లేకుండానే జాబ్ ….

India Post Circle GDS Recruitment 2024

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే.. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు..

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే.. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీలను కూడా వెబ్‌సైట్లో పొందుపరిచారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టుల వరకు ఉన్నాయి.

Male postal worker in uniform holding bicycle handlebar and greeting

పోస్టుల వివరాలు ఇవే..

  • బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)
  • అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)
  • డాక్‌ సేవక్‌

మొత్తం పోస్టుల సంఖ్య: 44,228

Name of the Post: India Post Circle GDS Online Form 2024 

Post Date: 15-07-2024

Total Vacancy: 44228

వయోపరిమితి (05-08-2024 నాటికి) కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది
అర్హత:
అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలి
దరఖాస్తు రుసుము

SC/ST/PwD/స్త్రీ/ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులు: ఎలాంటి ఫీజు లేదు
OBC/Genaral : 100/-
చెల్లింపు విధానం: క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు మరియు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం/ UPI.

ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు & సమర్పణకు ప్రారంభ తేదీ : 15-07-2024
ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు & సమర్పణకు చివరి తేదీ : 05-08-2024
సవరణ/దిద్దుబాటు విండో కోసం తేదీ: 06-08-2024 నుండి 08-08-2024 వరకు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి కింద తప్పనిసరిగా అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి, పోస్టులను కేటాయిస్తారు.  ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Share this article

Subscribe

By pressing the Subscribe button, you confirm that you have read our Privacy Policy.
Your Ad Here
Ad Size: 336x280 px

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *