Search
Close this search box.

రైల్వేలో 2424 అప్రెంటిస్‌ పోస్టులు.. 10th, ITI ఉత్తీర్ణత ఉండాలి

Railway RRC Recruitment

RRC Central Railway Apprentice Recruitment 2024 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ ద్వారా సెంట్రల్ రైల్వే 2424 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులను అధికారిక వెబ్ సైట్ https://rrccr.com/ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 16వ తేదీన ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో 2024 ఆగస్టు 15వ తేదీతో ముగియనుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ https://rrccr.com/ చూడొచ్చు.

విద్యార్హతలు :

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పరీక్ష లేదా తత్సమాన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా.. గుర్తింపు పొందిన బోర్డు నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 15.7.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :

సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఈ పేమెంట్ ఆన్ లైన్ లోనే చెల్లించాలి. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/ ఎస్‌బీఐ చలానా మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు. అలాగే.. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ఎంపిక ప్రక్రియ :

అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మెట్రిక్యులేషన్ (కనీసం 50 శాతం మార్కులతో) తో పాటు అప్రెంటిస్ షిప్ చేయాల్సిన ట్రేడ్ ఐటీఐ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధారణ సగటు మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Name of the Post: RRC, Central Railway Apprentice Online Form 2024

Post Date: 17-07-2024

Total Vacancy: 2424

Application Fee: Rs. 100/-For SC/ ST/ PWD/ Women Candidates: NilMode of Payment: Online through payment gateway
Important DatesStarting Date to Apply Online & Payment of Fee: 16-07-2024 at 11:00 HrsClosing Date to Apply Online & Payment of Fee: 15-08-2024 till 17:00 Hrs
Age Limit (as on 15-07-2024)Minimum Age Limit: 15 YearsMaximum Age Limit: 24 YearsAge Relaxation is applicable as per rules.
QualificationCandidates should possess must have passed 10th class examination or its equivalent (under 10+2 examination system) with minimum 50% marks and also possess National Trade Certificate (ITI) in the relevant Trades.
Important Links
Apply Online 
Click Here
Notification
Click Here
Official Website
Click Here

Share this article

Subscribe

By pressing the Subscribe button, you confirm that you have read our Privacy Policy.
Your Ad Here
Ad Size: 336x280 px

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *